ఛలో ఢిల్లీ కార్యక్రమానికి రాకేష్ టికాయత్ మద్దతు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 April 2022

ఛలో ఢిల్లీ కార్యక్రమానికి రాకేష్ టికాయత్ మద్దతు


ఢిల్లీ తెలంగాణా భవన్ లో టీఆర్ఎస్ నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని రైతుసంఘం నేత రాకేష్ టికాయత్ తెలిపారు. టీఆర్ఎస్ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కేంద్రం మద్దతుధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అవలంభించిన వ్యతిరేక విధానాల వల్ల దేశవ్యాప్తంగా రైతులకు నష్టం వాటిల్లుతోంది. మూడు చట్టాల విషయంలో కేంద్రం దిగివచ్చింది. నిరసనలో భాగంగా చనిపోయిన రైతులకు కేంద్రం ₹ 25 లక్షల నష్టపరిహారం చెలించాలని రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు. దేశమంతా ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తోన్న రైతుబంధు భేష్. అది దేశానికే ఆదర్శమని రాకేష్ టికాయత్ కొనియాడారు. తెలంగాణా తరహాలో అన్ని రాష్ట్రాల్లో రైతుబంధును అమలుచేయాలి. దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు అందించాలి. ఉచిత కరెంటు విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అభినందనీయని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో తలపెట్టే ఏ కార్యక్రమానికైనా మా మద్దతు ఉంటుందని కిసాన్ నేత రాకేష్ టికాయత్ ప్రకటించారు.

No comments:

Post a Comment