మాకు హాని తలపెట్టాలని చూస్తే సహించం

Telugu Lo Computer
0


అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఇండియన్‌- అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినంగానే వుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా టాప్‌లో ఉందని తెలిపారు.  ‘భారత సైన్యం ఎలాంటి దీటైన జవాబిచ్చిందో బహిరంగంగా చెప్పలేను. అలాగే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా చెప్పలేను. కానీ… చైనాకు మాత్రం ఓ హెచ్చరిక వెళ్లింది. భారత ప్రభుత్వం అలాంటి వాటిని ఉపేక్షించదన్న విషయం మాత్రం అర్థమైంది. ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోదు అన్న విషయం మాత్రం చైనాకు బోధపడింది’. అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్ దౌత్యపరంగా ఓ దేశంతో సత్సంబంధాలను కొనసాగించినంత మాత్రాన.. ఇతర దేశంతో సరైన దౌత్య సంబంధాలను కొనసాగించదన్న అర్థం కాదని, అలాంటి దౌత్య నీతిని భారత్ ఎప్పుడూ అవలంబించదని అమెరికాకు పరోక్షంగా చురకలంటించారు. భారత్ ఎప్పుడూ విన్‌-విన్ కాన్సెప్ట్ ప్రకారమే దౌత్యాన్ని నెరుపుతుందని రాజ్‌నాథ్ తేల్చి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)