రాముడు దేవుడు కాదు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 April 2022

రాముడు దేవుడు కాదు !

 


అంబేద్కర్ జయంతి సందర్భంగా బీహార్‌లోని జముయ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ రామాయణం  ఓ కథ మాత్రమేనని రాముడు ఆ కథలో పాత్ర మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. రాముడి పాత్ర వాల్మీకి, తులసీదాస్ ల సృష్టి మాత్రమేనని అన్నారు. లోకానికి ఓ సందేశం ఇవ్వటానికి వాల్మీకి, తులసీదాస్ లు రాముడి పాత్రను సృష్టించారని అన్నారు. రాముడు దేవుడు అనడంలో తనకు నమ్మకంలేదని జితన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు. “వాల్మీకి, తులసీదాస్ రామాయణం కావ్యాలను రచించారు. ఆ రామాయణంలో ఎన్నో మంచి విషయాలున్నాయి. వాల్మీకి, తులసీదాస్ లను నమ్ముతాను..వారిని నేను వారిని నేను గౌరవిస్తాను. కానీ రాముడు దేవుడు అంటే మాత్రం నేను నమ్మను అన్నారు. గానీ వారు రూపకల్పన చేసిన రాముడు దేవుడంటే మాత్రమే నమ్మలేం” అని అన్నారు. “శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను రాముడు తిన్నాడని చాలా మంది నమ్ముతారు. కానీ నేను మాత్రం నమ్మను అని వ్యాఖ్యానించిన జితన్ రామ్ మరో అడుగు ముందుకేసి మరో మాట అన్నారు. శబరి ఎంగిలి పండ్లను రాముడు తిన్నాడని నమ్మే మీరు,  మేం కొరికి ఇచ్చిన ఎంగిలి పండ్లను మీరు మాత్రం తింటారా? తినరు.  కనీసం మేం తిన్నవాటిని తాకను కూడా తాకరు” అంటూ వ్యాఖ్యానించారు. జితన్ రామ్ వ్యాఖ్యలు పరోక్షంగా హిందూవాదులపైనే చేసినట్లుగా ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దేశంలో రెండే కులాలు ఉన్నాయని, ఒకటి ఉన్నోళ్లు, రెండు లేనోళ్లు అని జితన్ రామ్ మాంఝీ అన్నారు. మాంఝీ కుమారుడు సంతోష్ బీహార్ లోని బీజేపీ సంకీర్ణంలో మంత్రి కాగా..మాంఝీ దళితుడు. మాంఝీ సారథ్యంలోని హిందూస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) ఎన్డీయే భాగస్వామ్య పక్షం. అయినప్పటికీ మాంఝీ రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

No comments:

Post a Comment