సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం

Telugu Lo Computer
0


కేరళలోని కన్నూర్‌ లో సిపిఎం 23వ జాతీయ మహాసభలు ఈరోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి.  సీనియర్‌ నాయకులు రామచంద్ర పిళ్లై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు ఫాసిజం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. మహాసభ ఈ అంశాలను చర్చించి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. సిపిఎం చరిత్రలో ఈ మహాసభ మైలు రాయిగా నిలుస్తుందని చెప్పారు. మార్క్సిజాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. అనంతరం మహాసభల ప్రతినిధులు అమరవీరులకు నివాళలు అర్పించారు. ఈ రోజు నుండి పదో తేదీ వరకు జరిగే ఈ మహాసభలకు దేశనలుమూలల నుండి దాదాపు 900 మంది ప్రతినిధులు హాజరౌతున్నారు. ఈ మహాసభలకు సిపిఎం అగ్రనాయకత్వం సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌, మాణిక్‌ సర్కార్‌, బృందా కరత్‌, సుభాషిణి అలీ, పినరయి విజయన్‌, బివి రాఘవులతోపాటు పలువురు హాజరౌతున్నారు. అనంతరం అమరులకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్ బ్యుూరో సభ్యులు మాణిక్ సర్కార్ తీర్మానం ప్రవేశపెట్టగా.. మహా సభ ఆమోదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)