దేశంలో 1,086 కొత్త కేసులు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా కేసులు 36 శాతం మేర పెరగ్గా, 70కి పైగా మరణాలు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం మంగళవారం 4.8 లక్షలమందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,086 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే దాదాపు 300 మేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 0.23 శాతానికి చేరింది. మొత్తం కేసులు 4.30 కోట్లు దాటాయి. గడిచిన 24 గంటల్లో 71 మరణాలు సంభవించాయి. అందులో కేరళ వాటానే 66గా ఉంది. మొత్తంగా 5.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకూ క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతూ ఊరటనిస్తున్నాయి. తాజాగా ఆ సంఖ్య 11,871 తగ్గింది. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.03 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)