తగ్గిన కాంగ్రెస్ ఆదాయం

Telugu Lo Computer
0


భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదాయం గణనీయంగా తగ్గుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. తమ పార్టీకి సంబంధించిన వార్షిక ఆదాయ నివేదికను కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించింది. గత మార్చి 30 నాటికి సమర్పించిన నివేదిక ప్రకారం 2020-21 సంవత్సరానికి గాను కాంగ్రెస్ ఆదాయం దాదాపు 58 శాతానికిపైగా తగ్గింది. మరోవైపు పార్టీ వ్యయం కూడా భారీ స్థాయిలో తగ్గింది. లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2019లో పార్టీ వ్యయం రూ.998.15 కోట్లు కాగా, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.209 కోట్లకు తగ్గింది. చివరగా కాంగ్రెస్‌కు అధిక ఆదాయం వచ్చింది 2018-19లోనే. ఆ ఏడాది కాంగ్రెస్‌కు దాదాపు రూ.918 కోట్ల ఆదాయం సమకూరింది. ఆ తర్వాతి నుంచి వరుసగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. కూపన్ల విక్రయం ద్వారా పార్టీకి ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూపన్ల ద్వారా రూ.156.9 కోట్ల ఆదాయం రాగా, విరాళాలు, గ్రాంట్ల ద్వారా మిగతా ఆదాయం సమకూరినట్లు కాంగ్రెస్ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)