ప్రియురాలిపై అత్యాచారం

Telugu Lo Computer
0


బెంగుళూరు నగర శివారు ప్రాంతమైన యలహంక ప్రాంతానికి చెందిన 15 యేళ్ల బాలికను ప్రేమిస్తున్నట్టు 25 యేళ్ళ యువకుడు నమ్మించాడు. పిమ్మట పెళ్ళి విషయమై మాట్లాడదామని చెప్పడంతో ఆ యువతి అతని మాటలు నమ్మింది, ఆ యువకుడి వెంట వెళ్లింది. ఈ క్రమంలో యలహంకలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న నిందితుడి స్నేహితుడు ఈ ఘటనను సెల్‌ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆ వీడియోను బాధిత బాలికకు పంపించి వేధించసాగాడు. తన స్నేహితులకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించసాగాడు. దీంతో భయపడిన ఆ బాలిక కొంత డబ్బులు సేకరించి వారికి ఇచ్చింది. అయితే, డబ్బులు తీసుకున్న తర్వాత బాలికను వదిలిపెట్టకుడా వారం రోజుల పాటు బెదిరించి అత్యాచారం చేశారు. గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న కుమార్తెను గమనించి తల్లిదండ్రులు ఆరా తీయగా, జరిగిన విషయాన్ని బోరున విలపిస్తూ చెప్పింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షణాలపై ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉండటం  విశేషం . 

Post a Comment

0Comments

Post a Comment (0)