మద్యం దుకాణాల పేర్లపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

Telugu Lo Computer
0


మద్యం దుకాణాలకు పేర్లు పెట్టె అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మద్యం దుఖాణాలు, బార్లకు దేవుళ్ళు, దేవతల పేర్లు, జాతీయ నాయకుల పేర్లు, ఇతర సాంప్రదాయ కట్టడాల పేర్లు పెట్టరాదని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఉన్న పేర్లను కూడా అధికారికంగా మార్చుకునేందుకు జూన్ 30 వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఆ మేరకు దేవుళ్ళు, దేవతలు, ప్రముఖ సాధువులు, పరిపాలన ద్వారా జాబితా చేయబడిన 56 జాతీయ నాయకుల పేర్లు మరియు రాష్ట్రంలోని 105 చారిత్రక కోటల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. జాబితాలో ఉన్న పేర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం దుకాణాలకు పెట్టరాదని సూచించిన ప్రభుత్వం ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సదరు మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించింది. మద్యం విక్రయశాలలకు ఆయా పేర్లు పెట్టడం వల్ల వాటి పవిత్రత సన్నగిల్లుతోందని, సామాజిక, మతపరమైన వాతావరణాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)