మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం

Telugu Lo Computer
0


షోపియాన్ జిల్లాలో ఈనెల 6న దాడికి గురైన కశ్మీర్ పండిట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లాలనుకున్నానని, దీంతో తనను గృహనిర్బంధంలోకి తీసుకున్నారని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ విషయాన్ని ఒక ట్వీట్‌లో ముఫ్తీ తెలిపారు. కశ్మీర్ ప్రజలు లోయను విడిచిపెట్టడానికి అక్కడి ప్రజల పైన, ముస్లింలపైన భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారం బయటపడకుండా కట్టడి చేస్తోందని తప్పుపట్టారు. కాగా, సెక్యూరిటీ కారణాల వల్లే అనంతనాగ్ జిల్లాకు వెళ్లకుండా మెహబూబా ముఫ్తీని అదుపులోనికి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)