సంబరాల 'రాంబాబు' కాడు... అంబటి రాంబాబు !

Telugu Lo Computer
0


అంబటి రాంబాబుకు సినిమా రంగంలో మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే గతంలో అంబటి రాంబాబు సినిమాల్లోనూ నటించారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఓ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో ఆసక్తి ఉండటంతో గతంలో ఆయన సినిమాల్లో నటించినట్లు ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతోంది. అయితే అంబటి రాంబాబు నటించిన సినిమా ఏమిటి.. ఈ ఫోటోల్లో ఆయన పక్కన ఉన్న హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఆయన వయసులో ఉన్నప్పుడు పలు సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించారని తెలుస్తోంది. ఆయన సినిమాల్లో నటించినప్పటి ఫోటోలు ఇప్పుడు బయటకు రావడంతో.. అంబటి రాంబాబు నెట్టింట మరోసారి వైరల్‌గా మారిపోయారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అంబటి రాంబాబుకు చాలా మంది సన్నిహితులు ఉన్నారు. వారిలో జీవితా రాజశేఖర్, రాజశేఖర్ కూడా ఉన్నారు. నిజానికి వారిని వైసీపీలో చేరేలా చేసింది అంబటి రాంబాబు అన్న విషయం అందరికీ తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)