ట్రాఫిక్ నిలిపివేతతో చిన్నారి మృతి

Telugu Lo Computer
1



ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేశ్-ఈరక్క దంపతులకు ఎనిమిది  నెలల క్రితం పాప జన్మించింది. నిన్న సాయంత్రం చిన్నారి ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే వారు ఆటోలో కళ్యాణదుర్గం బయలుదేరారు అదే సమయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ పట్టణానికి వస్తుండడంతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో చిన్నారితో వెళ్తున్న ఆటో పట్టణ శివారులో చిక్కుకుపోయింది. ఆలస్యం అవుతుండడంతో తెలిసివారి బైక్‌పై చిన్నారిని తీసుకుని బయలుదేరారు. 15 నిమిషాల తర్వాత ఆసుపత్రికి చేరుకున్నారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయకుంటే తమ కుమార్తె బతికేదని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తాము ఎవరినీ అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. చిన్నారి అస్వస్థతకు గురైందని తెలియగానే వెంటనే వారిని పంపించామని చెప్పారు.

Post a Comment

1Comments

  1. పోలీసులు (కొబోతున్న)మంత్రి గారి కోసం ట్రాఫిక్ నిలిపివేసారంటే వారు కాదనే అంటారు కదండీ. ట్రాఫిక్ నియంత్రణ చేసాం (నాయకుల వారి కోసం) అంతే అనే అంటారు. Some are more equal ఆని అంటారు కదండీ. ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఎన్ని జరిగినా ఓట్లు తెచ్చుకోగల నాయకులకు మర్యాదాలోపం జరగకుండా పోలీసులు జాగ్రత్త పడతారు కానీ మనలాంటి వారి అసౌకర్యానికి వారు చింతిస్తారా ఏమిటీ మన పిచ్చి కాకపోతే.

    ReplyDelete
Post a Comment