నోటిపూత సమస్యలు బాధిస్తుందా ?

Telugu Lo Computer
0


నోటి అపరిశుభ్రత, పోషకాహార లోపాల కారనంగా ఈ నోటి పూత సమస్య వస్తుంది. విటమిన్ బి13 , ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన అజీర్ణం వంటివి కారణం కావచ్చు. బుగ్గలోపల, పెదవుల మీద, నాలుకపైన పుండ్లు వంటివి ఏర్పడతాయి. పుండుకి మధ్యలో పసుపు, బూడిద రంగులో చీములాగా ఏర్పడుతుంది. తినేసందర్భంలో, మాట్లాడే సందర్భంలో నొప్పిని కలిగిస్తాయి. పుండ్లు ఇతర ప్రదేశాలకు వ్యాప్తిచెందుతాయి. కొన్ని సందర్భాల్లో వీటి కారణంగా జ్వరం కూడా వస్తుంది. నోటిపూతలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటించటం అవసరం. తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి పూత నుంచి ఉపశమనం పొందడానికి గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ నీటితో నోటిని రోజూ పుక్కిలించాలి. నిమ్మ, ఆరెంజ్ వగైరా సిట్రస్ ఫ్రూట్స్ లో పుష్కలంగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి నోటి పూతను నివారిస్తుంది. కొబ్బరినూనెలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. కొబ్బరినూనెను పుండ్లపై అప్లై చేయడం ద్వారా వెంటనే నోటి పూత నుంచి విముక్తి కలుగుతుంది. తరచూ దంతపరీక్షలు చేయించుకోవాలి. చాక్లెట్లు, దూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)