108 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 15 April 2022

108 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని


గుజరాత్‌ లోని  మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు.  ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. హనుమాన్జీ చార్ ధామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండవది. మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు. ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు నెలకొల్పింది. జాఖూలోని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీని కోసం మొత్తం 1500 టన్నుల కాంక్రీట్‌, ఇనుము, రాళ్ళు ఉపయోగించారు. సిమ్లాలోని జాఖూలో బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ అల్లుడు నందా నిర్మించిన హనుమాన్‌ విగ్రహం 'గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌'లోనూ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. విగ్రహం స్థిరంగా ఉండేందుకు 178 అడుగుల లోతుతో పునాది వేశారు. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఉంది. లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. అందుకే అంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment