మంచు విష్ణును ఆడేసుకుంటున్న ట్రోలర్స్

Telugu Lo Computer
0


మంచు విష్ణును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈసారి సినిమా పరంగా మా ప్రెసిడెంట్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ప్రస్తుతం విష్ణు, ఇషాన్ దర్శకత్వంలో గాలి నాగేశ్వరరావు నఏ సినిమా చేస్తున్న విషయం విదితమే. హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అప్ డేట్ లు అందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నాడు మంచు విష్ణు. తాజాగా ఒక సాంగ్ కోసం డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాని, నా బాడీ మొత్తం హార్ట్ అయ్యినట్లు ట్వీట్ చేశాడు.. ఇక ఈ ట్వీట్ పై ట్రోలర్స్ తమదైన శైలిలో ఆడేసుకుంటున్నారు. 'డాన్సా? ఫైట్ సీన్ అయ్యుంటదిలే' అంటూ మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు. ఈ సెటైర్లు గమనించిన మంచు విష్ణు 'నా కొరియోగ్రాఫర్ కూడా నా డాన్స్ మూవ్ మెంట్స్ ఫైట్ సీక్వెన్స్ లా వుంటాయని అంటున్నాడు' అని రిప్లై ఇచ్చాడు. మరికొందరు అన్న సన్నీ లియోన్ తోనే సాంగ్ అయ్యి ఉంటుంది.. అందుకే కొంచెం గట్టిగా కష్టపడినట్లున్నావ్ అని కామెంట్స్ పెడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)