కేసీఆర్ ఆశీర్వాదం కోసమే ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 29 April 2022

కేసీఆర్ ఆశీర్వాదం కోసమే !


ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా.. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌కు వచ్చారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రోజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌తో సమావేశం ముగిసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. మంత్రి అయ్యాక కుటుంబంతో కలిసి ప్రగతి భవన్‌కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని రోజా పేర్కొన్నారు. కేసీఆర్ తనను ఓ కూతురిగా చూస్తారని, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రగతి భవన్‌కు వచ్చానని రోజా స్పష్టం చేశారు.

No comments:

Post a Comment