జిగ్నేష్‌ మేవానీ అరెస్ట్‌

Telugu Lo Computer
0


గుజరాత్ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు అరెస్టు చేశారు. ట్వీట్‌కు సంబంధించిన కేసులో పాలన్‌పూర్‌ సర్క్యూట్‌ హౌస్‌ వద్ద బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్‌ తరలించారు. అటునుంచి గురువారం ఉదయం గువాహటి తీసుకెళ్లారు. మేవానీని అరెస్టు చేసినట్లు అసోం పోలీసులు ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ట్వీట్ ఆధారంగా రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని కలిగించేందుకు యత్నించారని, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించారని కేసు నమోదుచేశారు. కాగా, ఈఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్‌ను అరెస్టు చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)