అల్కా లాంబా కు పంజాబ్ పోలీసులు సమన్లు

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ పోలీసులు కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఏప్రిల్ 26న సదర్ రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు రావాలని సమన్లు జారీ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అల్కా లాంబా ఢిల్లీ సీఎంపై చేసిన అవమానకర వ్యాఖ్యకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావాలని ఆమె ఇంటి గోడపై పోలీసులు నోటీసును అతికించారు.సీఎంపై చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు కోసం ఈ నెల 26వతేదీ లేదా అంతకుముందు సదర్ రూప్ నగర్ పోలీసుస్టేషనులో వ్యక్తిగతంగా హాజరుకావాలని అల్కాలాంబాకు పోలీసులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. అల్కా లాంబాపై రూప్‌నగర్ పోలీసులు సీఆర్‌పీసీ, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, 1988లోని సెక్షన్ 125 కింద కూడా కేసు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తారుమారు చేయకూడదని, కొన్ని ఆదేశాలను పాటించాలని లాంబాను పోలీసులు తన నోటీసులో కోరారు. ''మీరు దర్యాప్తు బృందం ​​ముందు హాజరు కావడంలో విఫలమైతే, నిర్బంధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం''అని పోలీసులు హెచ్చరించారు.ఈ నోటీసుకు సంబంధించిన సమాచారాన్ని అల్కా లాంబా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు.చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు కోసం ఈ నెల 26వతేదీ లేదా అంతకుముందు సదర్ రూప్ నగర్ పోలీసుస్టేషనులో వ్యక్తిగతంగా హాజరుకావాలని అల్కాలాంబాకు పోలీసులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. రూప్‌నగర్ పోలీసులు సీఆర్‌పీసీ, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, 1988లోని సెక్షన్ 125 కింద కూడా కేసు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తారుమారు చేయకూడదని, కొన్ని ఆదేశాలను పాటించాలని లాంబాను పోలీసులు తన నోటీసులో కోరారు. ''మీరు దర్యాప్తు బృందం ​​ముందు హాజరు కావడంలో విఫలమైతే, నిర్బంధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం''అని పోలీసులు హెచ్చరించారు.ఈ నోటీసుకు సంబంధించిన సమాచారాన్ని అల్కా లాంబా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)