వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Telugu Lo Computer
0


ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసలో చాలామందిని చర్మసంబంధిత సమస్యలు వేధిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ వల్ల కలిగే సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. వేసవికాలంలో నలుపు రంగు దుస్తులకు వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. వేసవిలో తెలుపు రంగు దుస్తులు, కాటన్ దుస్తులను వాడటం వల్ల ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చు.  వేసవిలో సన్ స్క్రీన్ లోషన్స్ ను వినియోగిస్తే ఎండ ప్రభావం చర్మంపై పడే అవకాశం ఉండదు. గొడుగును వాడటం వల్ల ఎండ నుంచి మనల్ని మనం సులువుగా రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా మనతో పాటు వాటర్ బాటిల్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎండ నుంచి ఉపశమనం పొందే అవకాశం వుంటుంది. రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.  ఆభరణాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. వేసవిలో ఏదైనా ఆరోగ్య సమస్య వేధిస్తే వైద్యులను సంప్రదించి మందులు వాడటం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)