18 ఏళ్లు పైబడిన వారందరూ బూస్టర్ డోస్ !

Telugu Lo Computer
0


18ఏళ్లు పైబడిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకునేందుకు  కేంద్ర వైద్యారోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తైన వారందరూ ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్టర్ డోస్ తీసుకోవచ్చని సూచించింది. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్రం బూస్టర్ డోసును ఉచితంగా ఇస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 96శాతం మంది ఫస్ట్ డోస్ తీసుకోగా, 86 శాతం మంది రెండో డోసు తీసుకున్నారు. యూకే, చైనాలో కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో.. 18ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరు బూస్టర్ డోసు తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నామని వైద్యారోగ్య శాఖమంత్రి మన్‎సుఖ్ మాండవీయ తెలిపారు. ఏప్రిల్ 10, ఆదివారం నుంచి 18 ఏండ్లు నిండిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవచ్చని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)