హిందీని రాష్ట్రాలపై రుద్దకండి !

Telugu Lo Computer
0


హిందీ మాట్లాడని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక ఉగ్రవాదాన్ని రుద్దేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. హిందీ జాతీయ భాష కాదని, అయినా అన్ని రాష్ట్రాలపై ఆ భాషను రుద్దేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందంటూ దుయ్యబట్టారు. పార్లమెంటరీ పార్టీ అధికారిక భాషా కమిటీ 37 వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాల్లో అధికారిక భాషను ఉపయోగించాలని, దీని ద్వారా హిందీ ప్రాముఖ్యం కచ్చితంగా పెరుగుందని అమిత్‌షా అన్నారు. ప్రాంతీయ భాషలు కాకుండా.. ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని పరిగణనలోకి తీసుకోవాలని కూడా షా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సిద్దరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందీని జాతీయ భాషగా గుర్తించాలంటూ అమిత్‌షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తీవ్ర ద్రోహం చేస్తున్నారని, తమ రాజకీయ ప్రయోజనం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఓ కన్నడిగుడిగా అధికార భాష విషయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. హిందీ జాతీయ భాష కాదు. దానికి మేం ఎప్పుడూ కట్టుబడం అంటూ సిద్దరామయ్య ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)