శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోండి

Telugu Lo Computer
0


రష్యా వల్ల ఉక్రెయిన్ లో ఏర్పడిన మానవతా సంక్షోభం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఈరోజు ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ లో ఘర్షణ పరిస్థితులు, ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న చర్చల గురించి జెలెన్ స్కీ ప్రధాని మోదీకి వివరించారు.ఉక్రెయిన్ లో పరిస్థితులు, భారతీయుల తరలింపు సహా భారత మానవతా సహకారం పై ప్రధాని మోదీ జెలెన్ స్కీ తో మాట్లాడారు. హింసను తక్షణమే నిలిపివేయాలని పునరుద్ఘాటించిన మోదీ…శాంతియుతంగా చర్చల ద్వారా రెండు దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలని జెలెన్ స్కీకి సూచించారు. యుక్రెయిన్ నుండి 20 వేల మందికి పైగా భారతీయ పౌరులను తరలించడానికి సహకరించిన ఉక్రెయిన్ అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఇంకా మిగిలి ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత రక్షణ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మోదీ…యుక్రెయిన్ లో మిగిలి ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించాలని జెలెన్స్‌కి ని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)