ఉగాది నుంచే కొత్త జిల్లాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో బిశ్వభూషణ్ హరిచందన్ అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం పని చేస్తుందని  అన్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభం కానుంది. అన్ని వర్గాలను ఆదుకునేలా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని గవర్నర్ తెలిపారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి పదివేలు ఇస్తున్నామని తెలిపారు.770 కోట్లు సాయం చేశామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు 12,758 కోట్లు కేటాయించినట్లు గవర్నర్ తెలిపారు. వివిధ పథకాల కింద...వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 2,354 కోట్లు చెల్లించామని చెప్పారు. వైఎస్సార్ కాపు నేతస్తం పధకం కింద ఐదు విడతల్లో 75 వేలు సాయం చేసినట్లు తెలిపారు. ఈబీసీ నేస్తం పథకం కింద ఏడాదికి పదిహేను వేలు చెల్లిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు 9,100 కోట్లు చెల్లించామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామని గవర్నర్ తెలిపారు.కిందిస్థాయి వరకూ పాలన కోసంపాలన కిందస్థాయి వరకూ విస్తరించేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కొత్తగా 16 మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. ఉచిత విద్యుత్తు పథకం కింద లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని, అయినా పేదలకు అందించే పథకాలను ప్రభుత్వం ఆపలేదని ఆయన పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)