రోడ్డు ప్రమాదంలో శ్రీ మేధా కాలేజ్ ప్రిన్సిపాల్ మృతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 4 March 2022

రోడ్డు ప్రమాదంలో శ్రీ మేధా కాలేజ్ ప్రిన్సిపాల్ మృతి


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో జరిగిన ఓ యాక్సిడెంట్​లో శ్రీ మేధా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ చనిపోయారు. సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై తిరుపతికి వెళ్లి తిరుగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పీలేరుకు తిరిగి వస్తుండగా శుక్రవారం సాయంత్రం భాకరాపేట ఘాట్ లో ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో బాలకృష్ణ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, స్థానికులు అతన్ని తిరుపతి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని భాకరాపేట పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


No comments:

Post a Comment