మనస్తాపంతో మహిళా డాక్టర్ ఆత్మహత్య

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఓ ప్రైవేట్‌ ఫెసిలిటీలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణి మృతి చెందింది. ఆ ఆస్పత్రిని డాక్టర్ అర్చన శర్మ, ఆమె భర్త కలిసి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణి చనిపోవటంతో ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ నిర్లక్యంగా వల్లే ఆమె చనిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఎంతగా సర్ధి చెప్పినా వినలేదు. డాక్టర్ అర్చన ఆమె భర్త నిర్లక్ష్యం వల్లే గర్భిణి చనిపోయింది అంటూ పోలీసు ఫిర్యాదు చేశారు. వెంటనే డాక్టర్ అర్చనపై చర్యలు తీసుకోవాలని వారి ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సదరు డాక్టర్‌ అర్చనపైనా ఆమె భర్తపైనా సెక్షన్ 302కింద కేసు నమోదు చేశారు. ఆమె పై తక్షణమై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడంతో లాల్సోట్ పోలీస్ స్టేషన్‌లో ఆ డాక్టర్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన డాక్టర్ అర్చన ఈ అవమానం తట్టుకోలేక తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. చనిపోయే ముందు డాక్టర్ అర్చన సూసైడ్ నోట్ రాసింది. గర్భిణికి ప్రసవం తరువాత తీవ్ర రక్త స్రావం జరిగింది అని అందుకే ఆమె మరణించింది అని..ప్రసవం సమయంలో ఇటువంటివి అరుదుగా జరుగుతుంటాయని దానికి డాక్టర్లను బాధ్యులను చేసి ఇలా వేధింపులు..దాడులు చేయటం సరికాదు అని నోట్ లో పేర్కొంది. రోగులను డాక్టర్లు బతికించటానికి ఎన్నో విధాలుగా యత్నిస్తారు అని..ఆ క్రమంలో డాక్టర్తు తీవ్ర మానసిక ఒత్తిడికి మనోవేదనకు గురి అవుతుంటారు అని కానీ ఈ విషయాన్ని ఎవ్వరు అర్థం చేసుకోరని..పైగా డాక్టర్లపై నిందలు..వేధింపులు, దాడులకు పాల్పడుతుంటారని ఇది సరైనది కాదు అని సూసైడ్ లేఖలో డాక్టర్ అర్చన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)