మధ్యప్రదేశ్‌లో గూండాలు, మాఫియాలకు చోటు లేదు

Telugu Lo Computer
0


గూండాలు, మాఫియాలకు మధ్యప్రదేశ్‌లో చోటు లేదని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్ కూతుళ్లతో అనుచితంగా ప్రవర్తించే వారిని పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు. అక్రమార్కుల ఇంటిని కూల్చివేసే పనిలో ఉన్నామని తెలిపారు. మహిళలపై లైంగిక దాడి ఘటనలపై ఈ మేరకు ఆయన స్పందించారు. ఉత్తరప్రదేశ్‌ తరహాలో నిందితులపై చర్యలు చేపడతామని పరోక్షంగా పేర్కొన్నారు. గూండాలు, మాఫియాలకు మధ్యప్రదేశ్‌లో చోటు లేదన్నారు. అక్రమాలకు పాల్పడే వారి ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి ఉపాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. జనవరి 2న 5.26 లక్షల మందికి, ఫిబ్రవరి 16న 5.04 లక్షల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. బుధవారం మళ్లీ 3.33 లక్షల మందికి స్వయం ఉపాధి కోసం రుణాలు ఇస్తున్నామని అన్నారు. వైద్య విద్య, ఇంజినీరింగ్‌ విద్యను హిందీలో అభ్యసించే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలవనున్నదని శివరాజ్‌ సింగ్‌ తెలిపారు. ఇంగ్లీష్‌లో నైపుణ్యం లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు సమాన అవకాశాలు పొందలేకపోతున్నారని చెప్పారు. దీనిని అదిగమించేందుకు వైద్య, ఇంజినీరింగ్‌ విద్యను హిందీలో అభ్యసించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రేవాకు విమాన సేవలను పొడిగిస్తామని పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)