కేరళ హైకోర్టులో మహిళా ధర్మాసనం

Telugu Lo Computer
0


కేరళ న్యాయ చరిత్రలో ఇదో అరుదైన సందర్భం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మహిళా జడ్జీలతో ఒక ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటైంది. ఆలయ నిధుల్ని గురువాయూర్‌ దేవస్థానం మేనేజింగ్‌ కమిటీ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థకి విరాళంగా ఇవ్వొచ్చా అనే అంశంపై దాఖలైన పిటిషన్లను మహిళా బెంచ్‌ విచారించింది. జస్టిస్‌ అను శివరామన్, జస్టిస్‌ షిర్సీ వి, జస్టిస్‌ ఎంఆర్‌ అనితలతో కూడిన మహిళా ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. అంతకు ముందు జస్టిస్‌ ఎ హరిప్రసాద్, జస్టిస్‌ అను శివరామ, జస్టిస్‌ ఎంఆర్‌ అనితలతో ఈ పిటిషన్‌ విచారణకు ఏర్పాటైన బెంచ్‌ బదులుగా మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్‌ని ఏర్పాటు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)