కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం : కేసీఆర్

Telugu Lo Computer
0


ఇక పై తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని కేసీఆర్ వెల్లడించారు. 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్నిరాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)