మహిళల వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కి బోణీ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 March 2022

మహిళల వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కి బోణీ !


న్యూజిలాండ్ లో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభం నుంచి వరుస ఓటములతో విమర్శలను ఎదుర్కొన్న పాకిస్తాన్ ఎట్టకేలకు ఈవెంట్ లో బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ పై గెలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా రేపో మాపో నాకౌట్ దశకు క్వాలిఫై అవుతోంది. దాంతో రెండు జట్లు సెమీస్ కు వెళ్లినట్లు అవుతుంది. మిగిలిన రెండు స్థానాల కోసం ప్రస్తుతం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో భారత్ తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. భారత్ ,ఇంగ్లండ్ జట్లు రెండు గెలిచి మూడు ఓడి నాలుగు పాయింట్లతో ఉండగా, వెస్టిండీస్ పాకిస్తాన్ తో మ్యాచ్ ముందు వరకు కూడా ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు గెలిచి రెండు ఓడి 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్ ల్లో బలహీన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లతో ఆడనుంది. కాబట్టి ఆ రెండు మ్యాచ్ ల్లోనూ ఇంగ్లండ్ గెలిచే అవకాశం ఉంది. భారత్ రేపు బంగ్లాదేశ్ తో ఆడి, ఈ నెల 27న సౌతాఫ్రికాతో ఆడాల్సి ఉంది. అయితే తాజాగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఓడటం భారత్ కు కలిసిరానుంది. ఎందుకంటే వెస్టిండీస్ ఇప్పుడు 6 మ్యాచ్ ల్లో 3 విజయాలు 3 ఓటములతో 6 పాయింట్లతో ఉంది. అందులోనూ ఆ జట్టు నెట్ రన్ రేట్ పేలవంగా ఉంది. 24న ఆ జట్టు సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికాతో తలపడనుంది. ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడి... మనం బంగ్లాదేశ్ పై గెలిచి సౌతాఫ్రికాతో ఓడినా సెమీస్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేడు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై వెస్టిండీస్ గెలిచినట్లయింటే మనకు సెమీస్ అవకాశాలు సన్నగిల్లేవి. ఆ లెక్కన పాకిస్తాన్ నేటి (21 మార్చి) మ్యాచ్ లో గెలిచి భారత్ ను నిలబెట్టిందన్నమాట. వర్షం కారణంగా మ్యాచ్ ను ఇన్నింగ్స్ కు 20 ఓవర్ల చొప్పున కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 7 వికెట్లకు 89 పరుగులు చేసింది. పాక్ బౌలర్ నిదా దర్ నాలుగు వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసి 8 వికెట్లతో గెలుపొందింది. మునీబ అలీ (37 ) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది

No comments:

Post a Comment