తెలంగాణలో స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు సిద్ధం !

Telugu Lo Computer
0


స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి' కార్యక్రమానికి తొలి విడత స్కూళ్ల ఎంపిక పూర్తయ్యింది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను మొత్తంగా 9,123 స్కూళ్లను ఎంపిక చేశారు. ఇందులో 5,399 ప్రాథమిక, 1,009 ప్రాథమికోన్నత, 2,715 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలం యూనిట్‌గా అత్యధికంగా విద్యార్థులున్న స్కూళ్లను ఎంపిక చేశారు. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 517 స్కూళ్లు, ఆ తర్వాత రంగారెడ్డిలో 464, సంగారెడ్డిలో 441 స్కూళ్లు ఉన్నాయి. స్కూ ళ్ల జాబితాను విద్యాశాఖ అధికారులు ఇటీవలే అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. 15 రోజుల్లో స్కూళ్ల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు మొత్తం 12 అంశాలకు సంబంధించిన అంచనాలు, బడ్జెట్‌ కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్లకు సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనలకు కలెక్టర్లు పరిపాలనాపరమైన ఆమోదం తెలుపగానే పనులు ప్రారంభం అవుతాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)