జియో శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 February 2022

జియో శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది ?


లక్సెంబర్గిష్ శాటిలైట్ మరియు నెట్వర్క్ ప్రొవైడర్ SES తో జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పూర్తిగా ఈ సర్వీస్ లు అమలులోకి వచ్చిన తరువాత భారతీయ యూజర్లకు 100Gbps వరకు ఇంటర్నెట్ వేగంతో అందిస్తుంది. జియో శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది మరియు దీని కోసం ఎటువంటి పరికరాలు అవసరమవుతాయనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మనం వాడుతున్న శాటిలైట్ టీవీ మాదిరిగా పనిచేసే శాటిలైట్ ఇంటర్నెట్ ను ఊహించవచ్చు. అయితే, సెట్ టాప్ బాక్స్ యొక్క శాటిలైట్ రిసీవర్లు కేవలం సిగ్నల్స్ ను స్వీకరించడం మాత్రమే చేస్తాయి. కానీ, శాటిలైట్ ఇంటర్నెట్ లో మాత్రం రిసీవర్లు డేటాను పంపడం మరియు స్వీకరించడం రెండింటినీ నిర్వహించాల్సి వస్తుంది. అంటే, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ పని చేయడానికి, మీకు శాటిలైట్ డిష్, WiFi రౌటర్/మోడెమ్, కేబుల్స్ మరియు ఇతర సామాగ్రి అవసరం. ఇక పూర్తి సెటప్ చేసిన తరువాత, అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహం నుండి ఇంటర్నెట్ నేరుగా ప్రసారం చేయబడుతుంది. ఈ ప్రక్రియలో జియోస్టేషనరీ,  మీడియం ఎర్త్ ఆర్బిట్  ఉపగ్రహలతో పాటు మల్టీ-ఆర్బిట్ స్పేస్ నెట్వర్క్లను ఉపయోగిస్తుందని జియో చెబుతుంది. అయితే, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ లను జియో ఎలా అందిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మాత్రం మరికొంత కాలం వేచిచూడాల్సిందే. అలాగే, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధర మరియు లభ్యత వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు. కాబట్టి, ఖచ్చితమైన మనం ఇంకొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది.

No comments:

Post a Comment