8 కోట్లు ఖర్చు పెట్టినా బతకలేదు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 14 January 2022

8 కోట్లు ఖర్చు పెట్టినా బతకలేదు!


మధ్యప్రదేశ్‌ లోని మౌగంజ్ తాలుకా రక్రి గ్రామానికి చెందిన ధరమ్‌జై సింగ్‌కు గత సంవత్సరం మే 2న కరోనా సోకింది. దీంతో ఆయన్ను వెంటనే రెవాలో ఉన్న సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ జరుగుతుండగా ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆయన్ను మే 18న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ఊపిరితిత్తులు 100 శాతం డ్యామేజ్ అయిపోయాయి. దీంతో సింగ్‌ను డాక్టర్లు ఏకెమ్మో మీద ఉంచారు. దేశంలోనే పేరుమోసిన డాక్టర్లు ఆయనకు ట్రీట్‌మెంట్ చేశారు. లండన్ నుంచి సింగ్ కోసం ప్రత్యేకంగా డాక్టర్‌ను పిలిపించారు. అయినప్పటికీ.. 8 నెలల పాటు కరోనాతో పోరాడి చివరకు అపోలో ఆసుపత్రిలో సింగ్ కన్నుమూశాడు. 8 నెలల పాటు లైఫ్ సపోర్ట్ మీదనే సింగ్ శ్వాస తీసుకున్నాడు. దాదాపు 8 నెలల పాటు కరోనా ట్రీట్‌మెంట్ తీసుకున్న తొలి వ్యక్తి సింగే కావడం గమనార్హం. సింగ్ కంటే ముందు మీరట్‌కు చెందిన విశ్వాస్ షైనీ 130 రోజుల పాటు కోవిడ్ చికిత్స తీసుకున్నాడు. దాదాపు 8 నెలల పాటు సింగ్ వైద్యఖర్చుల కోసం ఆయన కుటుంబ సభ్యులు తమకున్న 50 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి 8 కోట్లు ఖర్చు పెట్టారు. ఆసుపత్రిలో ఒక రోజుకు రూ.3 లక్షలు చెల్లించారు. అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా సింగ్‌ను మాత్రం ప్రాణాలతో కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు వాపోయారు.

No comments:

Post a Comment