బ్లాక్ యాపిల్ !

Telugu Lo Computer
0


ఇవి భూటాన్ కొండలపై పెరుగుతాయి. ఈ రకమైన యాపిల్‌ను 'హువా నియు' అని కూడా అంటారు. చైనీస్ కంపెనీ 'డాన్‌డాంగ్ టియాలువో షెంగ్ నాంగ్ ఇ-కామర్స్ ట్రేడ్' దీనిని 50 హెక్టార్ల భూమిలో బ్లాక్ యాపిల్స్ సాగు చేస్తుంది. అయితే ఇక్కడ యాపిల్స్ కేజీల లెక్కన కొనుగోలు చేస్తారు అనుకోకండి. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. ఇక్కడ ఒక్కో యాపిల్ లెక్కన కొనుగోలు చేస్తారు. ఒక్కో బ్లాక్ యాపిల్ ధర ఎంత ఉంటుందో తెలుసా? 50 యువాన్ అంటే 500 రూపాయలు. ఒక్క నలుపు రంగు యాపిల్ ను అంత ధర పెట్టి కొనుక్కోవాలన్నమాట. బ్లాక్ డైమండ్ యాపిల్ సాధారణ యాపిల్‌ల మాదిరిగానే ఆరోగ్యకరమైనది. బ్లాక్ యాపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గింపులో మరియు హృదయ సంబంధ వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. నలుపు రంగు యాపిల్స్ లో విటమిన్ 'సి' మరియు 'ఎ', అలాగే పొటాషియం, ఐరన్ కూడా ఉంటాయి. బయటి నుంచి చూస్తే.. బ్లాక్ యాపిల్ చాలా మృదువైనదిగా.., ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ యాపిల్ విస్తృతంగా అందుబాటులో ఉండదు. దీని ఉత్పత్తి చాలా పరిమితం. ఒక సాధారణ యాపిల్ చెట్టు పరిపక్వం చెందడానికి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అయితే ఒక బ్లాక్ యాపిల్ చెట్టు పరిపక్వం చెందడానికి 8 సంవత్సరాలు పడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)