టీ తాగిన వెంటనే ఇవి తీసుకోకూడదు !

Telugu Lo Computer
0


ఓ కప్పు టీ తాగితే చాలు.. అలసట తొలగిపోయి.. శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ ఇలా ఎన్నో రకాల టీల వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే టీ తీసుకున్న కాసేపటికే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. టీ తాగిన వెంటనే పుల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీకి గురయ్యే ప్రమాదం ఉంది. టీ తో పాటు తీసుకునే స్నాక్స్ ఐటమ్స్ లో నిమ్మకాయ లేదా ఏ ఇతర పుల్లని పదార్ధాలను తీసుకోకూడదు. ఎండ కాలంలో సాధారణంగా టీ తాగక ముందు, తాగిన తర్వాత.. చల్లటి నీరు తాగడం కొంత మందికి అలవాటుగా ఉంటుంది. అయితే టీ తాగిన వెంటనే చల్లటి నీరు తాగడం హానికరమని నిపుణులు అంటున్నారు. అలాగే టీ తాగిన గంట వరకు ఐస్ క్రీం వంటి చల్లటి పదార్థాలను తినవద్దని సూచిస్తున్నారు. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మొలకెత్తిన ధాన్యాలను అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే మొలకెత్తిన గింజలు తిన్న వెంటనే టీ తాగడం వల్ల కడుపులోని జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. టీ తాగే సమయంలో పసుపుతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలట!. లేకపోతే.. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసుపు, తేయాకు రెండూ విరుద్ధ గుణాలు కలిగి ఉంటాయంటూ.. ఆయా పదార్థాలు తిన్న వెంటనే టీ తాగొద్దని సూచిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)