ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుంది - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 29 December 2021

ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుంది


కర్నాటక లోని బీదర్‌ జిల్లా బసవకల్యాణ్ తాలుకా సస్తాపూర్ గ్రామానికి చెందిన భీమరావు ఆటో నడుపుతూ తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే భీమరావుకు సుమ అనే యువతి పరిచయమయింది. ఆ పరిచయం చివరకు ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ల పాటు వారిద్దరు కలిసి తిరిగారు. అయితే ఇటీవల ఆ యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. నన్ను పెళ్లి చేసుకోవా.. అని ఆశగా అడిగింది. కానీ అతడు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. మనిద్దరం మంచి స్నేహితులమని.. తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పాడు. పెళ్లి చేసుకోలేనని కుండబద్దలు కొట్టాడు. అతడి నుంచి ఊహించని సమాధానం రావడంతో సుమ షాక్‌ అయింది. ఎన్నోసార్లు బతిమిలాడింది. బెదిరించింది. అయినా అతడు అదే సమాధానం చెప్పాడు. భీమరావు ఎన్నిసార్లు చెప్పినా సుమ మాత్రం తగ్గలేదు. పెళ్లి కోసం ఒత్తిడి తెస్తూనే ఉంది. సుమ ఒత్తిడిని భరించలేక భీమరావు తన స్వగ్రామాన్ని వదిలిపెట్టాడు. తల్లిని తీసుకొని బాగ్ హిప్పర గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. అయినా సుమను వదిలిపెట్టలేదు. నిన్ను ఎంతో నమ్మానని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రూ.4 లక్షల సాయం కూడా చేశానని గొడవపెట్టుకుంది. తనను వివాహం చేసుకోకుంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. కానీ భీమ రావు మాత్రం లైట్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై సుమ పగ పెంచుకుంది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ వేసింది. కొందరు మనుషులను పంపిన.. భీమరావు ఇంటితో పాటు అతడి జీవనాధారమైన ఆటోను కూడా తగులబెట్టించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ పని చేసింది సుమ. భీమరావు ఇల్లుతో పాటు ఆటో కూడా పూర్తిగా కాలిపోయాయి. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుమతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

No comments:

Post a Comment