పౌష్టిక అల్పాహారం !

Telugu Lo Computer
0


మనం తీసుకునే అల్పాహారం రోజంతా కూడా మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ అల్పాహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అల్పాహారం సమయంలో మంచి పోషక పదార్థాలు ఉండే ఆహార పదార్థాలను డైట్లో తీసుకుంటే రోజంతా ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. 

బాదం: ఖాళీ కడుపుతో రెగ్యులర్ గా బాదం తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఉండవు. బాదంలో ప్రోటీన్, విటమిన్స్, మ్యాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు అల్పాహారానికి ముందు పర  కడుపున బాదం తీసుకుంటే మనం మరింత ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది.

పాలు మరియు అరటిపండు: పాలు, అరటి పండ్లు ప్రతి రోజు అల్పాహార సమయంలో తీసుకోవాలి. మీరు అరటిపండు పాలు విడిగా తీసుకోవచ్చు లేదా  రెండు కలిపి కూడా తీసుకోవచ్చు.

ఓట్ మీల్: పండ్లతో పాటు ఓట్ మీల్ కలిపి తీసుకుంటే మీరు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందులో ఫోలేట్, పొటాషియం వంటివి ఉంటాయి.

గుడ్లు: ప్రతి రోజు గుడ్లు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. అల్పాహారం సమయంలో ఒక గుడ్డు తీసుకుంటే మీరు మరింత దూరంగా ఉండొచ్చు. ప్రోటీన్ మొదలైన పోషక పదార్థాలు కూడా మీకు అందుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)