రిటైర్ అయినోళ్లకు మళ్లీ కొలువులు!

Telugu Lo Computer
0


జాబ్​ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు, ప్రమోషన్ల కోసం ఉద్యోగులు ఏండ్ల తరబడి ఎదురు చూస్తుంటే వాళ్లను కాదని సర్వీసు నుంచి రిటైర్​ అయినవాళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందల మెక్కిస్తున్నది. తమకు అత్యంత సన్నిహితులైనవాళ్లను పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి కూర్చోబెడుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు నడుస్తున్నది. నిరుడు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్​ రిసోర్స్​ డెవలప్​మెంట్​ సెంటర్​ (ఎంసీహెచ్​ఆర్డీ)లో ముగ్గురు రిటైర్డ్​ ఆఫీసర్ల నియామకం జరిగినట్లు ఇటీవల ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. వీరి వయసు 65ఏండ్లకుపైనే ఉంటుంది. టూరిజం డిపార్ట్​మెంట్​లోనూ ఇలాంటి వాళ్లు పది మంది ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ రెండు డిపార్ట్ మెంట్లే కాకుండా అన్ని డిపార్ట్ మెంట్లలో కలిపి దాదాపు 3వేల మందికిపైగా రిటైర్డ్​ ఎంప్లాయీస్​ మళ్లీ కొలువులు చేస్తున్నట్లు సమాచారం. కొందరు అడ్వయిజర్లుగా, ఇంకొందరు కన్సలెంట్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలకుపైనే జీతం వస్తున్నది. దానికి తోడు అన్నిరకాల సౌలతులు అందుతున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు అనుబంధంగా ఉన్న ఎంసీహెచ్‌ఆర్డీలో ప్రకాశ్​రావు, గౌతమ్ పింగ్లే, అబ్బాస్ అలీ అనే ముగ్గురు రిటైర్డ్​ ఆఫీసర్లు పనిచేస్తున్నట్లు ఇటీవల ఆర్టీఐ ద్వారా తేలింది. కాంగ్రెస్​ లీడర్​ బక్క జడ్సన్​ ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ ముగ్గురి వయసు 65 ఏండ్ల పైనే ఉంది. రూల్స్​ ప్రకారం 65 ఏండ్లకు పైబడిన వ్యక్తులను డ్యూటీలోకి తీసుకోకూడదు. కానీ, రూల్స్‌కు​ వ్యతిరేకంగా నిరుడు ముగ్గురు రిటైర్డ్​ ఆఫీసర్లను ఎంసీహెచ్​ఆర్డీలోకి తీసుకున్నారు. వీరిలో ప్రకాశ్​ రావుకు 70 ఏండ్లు అని, ఏపీకి చెందిన వ్యక్తి అని బక్క జడ్సన్ అన్నారు. ఒకే వ్యక్తిని డైరెక్టర్ (ఫెసిలిటీస్ ), జనరల్ మేనేజర్ ( ఫెసిలిటీస్ ) రెండు పోస్టుల్లో నియమించినట్లు, రూ. లక్ష జీతం ఇస్తున్నట్లు ఆర్టీఐలో ఎంసీహెచ్ ఆర్డీ వెల్లడించిందని ఆయన చెప్పారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ కింద ఉన్న ఎంసీహెచ్ ఆర్డీలో నియామకాలపై మంత్రి హరీశ్‌కు లెటర్​ రాసినా స్పందన లేదని, హైకోర్టులో పిల్ దాఖలు చేశానన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కొందరు రిటైర్డ్ అధికారుల సర్వీస్ ను ప్రభుత్వం పొడిగిస్తూ వస్తున్నది. 2014 లో రిటైర్ అయిన అధికారులు, ఉన్నతాధికారులు ఇప్పటికీ సర్వీసులో కొనసాగుతున్నారు. వీరికి జీతం, వెహికల్ , సిబ్బంది, ఇతర అలవెన్సులు కలిపి ఏటా కోట్ల రుపాయలు సర్కారు ఖర్చు చేస్తున్నది. రిటైర్డ్​ ఐఏఎస్ లు, రిటైర్డ్​ ఐపీఎస్ లను కన్సల్టెంట్లుగా , అడ్వయిజర్లుగా నియమించుకుంటున్నది. మాజీ సీఎస్ లు, మాజీ డీజీపీలు ప్రస్తుతం సర్కారులో కీలక పదవుల్లో ఉన్నారు. ఆర్ బీ , ఇరిగేషన్, విద్యుత్ లో ఈఎన్ సీ, సీఈ సర్వీస్ కంప్లీట్ అయినప్పటికీ కొందరికి సర్వీస్ ను ప్రభుత్వం పొడిగించింది. దాదాపు అన్ని శాఖలు, వాటి అనుబంధ విభాగాల్లో సుమారు 3 వేల మంది రిటైర్డ్​ అధికారులు ఇంకా పనిచేస్తున్నట్లు కాంగ్రెస్​ లీడర్​ బక్క జడ్సన్​ పేర్కొన్నారు. దీన్నే కోట్​ చేస్తూ ఆయన హైకోర్టులో పిల్​ వేశారు. ఒక్కో డిపార్ట్ మెంట్ లో అడ్వయిజర్లు, కన్సల్టెంట్లు కాకుండా సుమారు ఐదుగురు రిటైర్డ్​ ఉద్యోగుల కొనసాగుతున్నారని తెలిపారు. వీళ్లందరినీ తొలగించి కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్​ అయినవాళ్లను కొనసాగిస్తుండటంతో మరో వైపు కింది స్థాయి అధికారులు ఏండ్ల తరబడి ప్రమోషన్లు లేక అదే హోదాలో రిటైర్​ అవుతున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)