ప్యాసింజర్ రైలు చార్జీల పెంపు !

Telugu Lo Computer
0


ప్యాసింజర్ రైళ్ల వేగం పెంచడంతోపాటు ఛార్జీలను కూడా భారీగా పెంచింది. ప్యాసింజర్ రైలు చార్జీలను 30 నుంచి 40 శాతం వరకు పెంచినట్లు తెలుస్తుంది. ఈ రైళ్లు సోమవారం నుంచి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. రైళ్లవేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన రూట్లలో పట్టాల సామర్థ్యాన్ని పెంచింది. కరోనా కారణంగా రిజర్వేషన్‌ టికెట్ల తరహాలోనే జనరల్‌ సీట్లకు సైతం ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకోవలసి వచ్చింది. ఇకపై అన్ని రైల్వేస్టేషన్లలో కౌం టర్ల ద్వారా ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని ప్రయాణింవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)