శ్రీనాథుడు

Telugu Lo Computer
0


తనను పోషించిన రాజు లందరూ చనిపోగా యేమీ లేనివాడుగా మిగిలి పోయాడు శ్రీనాథుడు. బావా! రామున్నీ, భూమినీ నమ్ముకో నీకు మేలు కలుగుతుంది అన్న పోతనగారి   సలహాతో కొంత భూమికొని సాగు చేస్తాడు 

శ్రీనాథుడు.ఆ సంవత్సరం కృష్ణా నదికి వరదలు వచ్చి పంట అంతా కొట్టుకొని పోతుంది. రాలిన గింజ  లేమో

పక్షులు దిని పోతాయి. రాజేమో 700 టంకాలు

(ఆనాటి నాణాలు) సుంకం కట్టమంటాడు. కట్టలేక పోతాడు శ్రీనాథుడు. అప్పటి రాజ శాసనం ప్రకారం పన్ను కట్టక పొతే కాళ్ళకూ ,చేతులకూ సంకెళ్ళు వేసి భుజం మీద పెద్ద రాతి గుండు నుంచి తిప్పిస్తారు అదీ శిక్ష.అలాగే చేస్తారు. అప్పుడు శ్రీనాథుడు.

   కవిరాజు కంఠంబు  కౌగలించెను గదా!  పురవీధి  నెదురెండ పొగడ దండ 

    ఆంద్ర నైషద కర్త యంఘ్రి  యుగ్మంబున తగిలి యుండెను గదా  నిగళ యుగము 

     వీర భద్రా రెడ్డి విద్వాంసు ముంజేత వియ్యామందేను గదా వెదురు గొడియ

      సార్వ భౌముని భుజాస్తంభ మెక్కెను గదా నగరు వాకిట నుండు నల్లగుండు 

                    కృష్ణ వేణమ్మగొనిపోయె నింత ఫలము బిల

                    బిలాక్షులు దినిపోయే దిలలు పెసలు 

                    బొడ్డుపల్లెను గొడ్డేరి మోస పోతి 

                    నెట్లు చెల్లింతు నికమీద  టంకంబు లేదు నూర్లు 

అని దుఖిస్తాడు శ్రీనాథుడు. పోతనకు ఈ సంగతి తెలిసి ఆ పన్ను తాను కట్టి అతన్ని విడిపించి తన యింటికి తీసుకొని పోయి వైద్యం చేయిస్తాడు. అప్పుడు శ్రీనాథుడు బావా!నీవేమో రాముడినీ, భూమినీ నమ్ముకోమని చెప్తే నేను భూమిని మాత్రమే నమ్ముకొని రాముడిని  నమ్ముకోలేక పోయాను. అందుకే యిలా జరిగింది. నేను యింక బ్రతికి ఏమి ప్రయోజనము? అని శ్రీనాథుడు.

కాశికా విశ్వేశు కలిసే వీరా రెడ్డి రంత్నాంబరంబు లే రాయడిచ్చు?

రంభ గూడె  తెనుంగు రాయ రాహుత్తుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు?

స్వర్గస్తు డయ్యె విస్సన మంత్రి మరి హేమ పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?

కైలాస గిరి బండే మైలారు విభుడేగి దిన వెచ్చ మేరాజు తీర్ప గలడు?

                      భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగె

                      కలియుగంబున నింక నుండ గష్ట మనుచు 

                      దివిజ కవివరుల  గుండియల్ దిగ్గురనగ

                      నరుగు చున్నాడు శ్రీనాథు డమర పురికి   

తనకు అండగా నిలిచి ఆదరించిన రెడ్డ్డి రాజులందరూ చనిపొయినారు. యింక కలియుగము లో వుండడము కష్టమని స్వర్గములో వుండే కవుల  గుండెలు అమ్మో శ్రీనాథుడు వస్తున్నాడట అని భయపడి  అదిరిపోయే లాగ శ్రీనాథుడు అమరపురికి పోవుచున్నాడు.అని అంటూ ప్రాణాలు వదిలాడు శ్రీనాథుడు.

  "కాశీఖండ మయః పిండం నైషధం విద్వదౌషధం."అని పొగడబడ్డ శ్రీనాథుడు ఎంత గొప్ప  వాడో కదా!

ఆయన వ్రాసిన 'కాశీఖండము' ఇనుము లాగా గట్టిదట(అంటే అంత త్వరగా అర్థమయ్యేదికాదు అని)ఆయన వ్రాసిన 'నైషధం'కావ్యం విద్వాంసు లందరికీ ఔషధము వంటిది. 

Post a Comment

0Comments

Post a Comment (0)