ఇందిరా ఆస్తి పోవద్దనే రాజీవ్ గాంధీ ప్రభుత్వం వారసత్వపు పన్ను రద్దు చేసింది !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని మోరెనాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకూడదనే ఉద్దేశంతో వారసత్వపు పన్నును రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణలు చేశారు. 1985లోనే రద్దు చేసిన వారసత్వపు పన్ను చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందని మోదీ ఎద్దేవా చేశారు. మతప్రాతిపదికన ప్రజలను విభజిస్తూ కాంగ్రెస్ దేశం చేతులు నరికివేసిందని ఆరోపించారు. "1985లో తన తల్లి ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె సంపద ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడేందుకు రాజీవ్ గాంధీ వారసత్వపు పన్ను, చరవాణి, స్థిరాస్తులపై విధించిన లెవీని రద్దు చేశారు. ఆ చట్టాన్ని మళ్లీ తెస్తే అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతారు. ప్రజల ఆస్తిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వానికి హక్కు ఉండాలని అంటోంది. ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకుండా చట్టాన్ని రద్దు చేసి.. ఇప్పుడు అదే పార్టీ నేతలు మళ్లీ చట్టం కావాలని అంటున్నారు. అలాంటి పని బీజేపీ ఎన్నడూ చేయదు. ముస్లిం వర్గాల ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది. మతపరమైన బుజ్జగింపుతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటోంది. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందజేస్తోంది. ఏ ముస్లింకైనా రేషన్ అందలేదని ఎప్పుడైనా విన్నారా. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, విద్య.. మత ప్రాతిపదికన ఇవ్వకూడదని నిర్ణయించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మతపరమైన కోటాను వ్యతిరేకించారు. అయితే కాంగ్రెస్ దానిని బ్యాక్ డోర్ ద్వారా ఇచ్చి వెన్నుపోటు పొడిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంది ముస్లింలను రహస్యంగా ఓబీసీ కేటగిరీలో చేర్చింది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం చట్ట విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. ఓబీసీల హక్కులను లాక్కోవడానికి కాంగ్రెస్ తమ అభిమాన ఓటు బ్యాంకును (ముస్లిం) బలోపేతం చేసేందుకు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటోంది" అని మోడీ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా అమెరికాలో ప్రస్తుతం అమలవుతున్న వారసత్వ పన్ను విధానాన్ని మెచ్చుకున్నారు. అమెరికాలో తల్లిదండ్రుల మరణానంతరం వారసులు పొందే ఆస్తిపై ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఆస్తి విలువలో 55 శాతం ప్రభుత్వం తీసేసుకుంటుంది. మిగతా 45 శాతం మాత్రమే వారసులకు దక్కుతుందని, సమాజం కోసం ఇలాంటి పన్ను వ్యవస్థలు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ కూడా పిట్రోడా వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)