భారీగా తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


గత వారాంతంలో 75 వేల వరకూ చేరుకున్న గోల్డ్ మార్కెట్ సూచీలు, ఈరోజు భారీ నష్టాలను చూడటంతో, తిరిగి 72 వేల రూపాయల మార్క్ కు చేరుకుంది. ఏప్రిల్ మొదటి నుంచి గోల్డ్ రేట్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ నెలలో 74 వేల పైకి చేరుకొని గోల్డ్ ఎన్నడూ లేనటువంటి రికార్డు ధరను నమోదు చేసింది. జరిగిన బంగారం ధరలు గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసిన మధుపర్లకు గొప్ప లాభాలను తెచ్చి పెట్టింది. అయితే, బంగారం కొనాలని చూస్తున్న పసిడి ప్రియులకు మాత్రం అందనంత ఎత్తులో ఎక్కి కూర్చుంది. కానీ, ఈ వారం మాత్రం పసిడి ప్రియుల ఆశలను నెరవేరుస్తూ బంగారం ధర ఒక్కసారిగా కిందకు దిగడం మొదలు పెట్టింది. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత బంగారం ధర తిరిగి 72 వేల మార్క్ ను చేరుకుంది. ఈరోజు తులం 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 73,690 వద్ద మొదలై రూ. 72,160 వద్ద క్లోజింగ్ నమోదు చేసింది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 1,530 రూపాయలు క్రిందకు దిగింది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ కూడా రూ.1,400 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 66,150 రూపాయల వద్దకు చేరుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)