ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో అధికారులు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా.. మద్యం, డబ్బు, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై ఈసీ భారీ ఎత్తున కొరడా ఝులిపిస్తుంది. ఈ క్రమంలో.. ఈసీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది ఈసీ. ఈ క్రమంలో.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఈఓ ఎంకే మీనా పరిశీలించారు. ఏపీలో నిరంతర నిఘా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్  ఏర్పాటు చేశారు. ఎంసీసీ ఉల్లంఘనలు, నగదు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిఘా ఉంటుంది. అంతేకాకుండా.. వెబ్ కాస్టింగ్ ద్వారా అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల్లో వాహనాల కదలికపై పర్యవేక్షణ ఉంటుంది. వెబ్ కాస్టింగ్, జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మద్యం సరఫరాపై కూడా నియంత్రణ ఉండనుంది. కాగా.. ఎంసీసీ ఉల్లంఘనలను పర్యవేక్షణకు దాదాపు 1,680 వాహనాలను ఈసీ సిద్ధం చేసింది. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా నిఘా ఉండనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)