మనుషుల మధ్య గోడలు కట్టడం తెలివైన పని కాదు : కేసీఆర్

Telugu Lo Computer
0


తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు దశాబ్దకాలం తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు…తాను ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకమని చాలా మంది అనుకున్నారని, కానీ తానెప్పుడూ అలా వ్యవహరించలేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. మనుషుల మధ్య గోడలు కట్టడం తెలివైన పని కాదని చెప్పుకొచ్చారు. తన హయాంలో ఏ ప్రాంతం వారైనా బాధపడే పరిస్థితి తాను తీసుకురానివ్వలేదని తెలిపారు. పదేళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్రాన్ని పాలించామన్నారు. మరోవైపు రైతాంగం కరువులో విలవిలలాడుతోందని, ఏ రంగంలో కూడా ప్రభుత్వ పనితీరు బాగోలేదని కేసిఆర్ ఫైర్ అయ్యారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేక కాంగ్రెస్ నాయకులు తర్జనభర్జన పడుతున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగితే తాగుబోతు రాష్ట్రమంటూ సోషల్ మీడియాలో బాకా చానళ్లు గోలగోల చేశాయని, అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగితే ఆదాయం వచ్చిందంటూ జబ్బలు చరుస్తున్నారని కేసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)