త్వరలో కొత్త రేషన్ కార్డులు !

Telugu Lo Computer
0


తెలంగాణాలో కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. లోక్ సభఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను వేగంగా చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటికే ప్రజా పాలన పేరుతో లబ్దిదారులనుంచి దరఖాస్తులు సేకరించిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. దీంతో కొద్దిరోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ నెరవేరనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం గతేడాది డిసెంబర్ 28 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్ పథకం వర్తించాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు లేక చాలా మందికి పథకాలు రావడం లేదు. జిల్లాల వారీగా భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఇప్పటికే 55 వేలకు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)