జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల !

Telugu Lo Computer
0


జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 కోటా) టికెట్లను టీటీడీ ఆన్ లైన్లో విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల (జులై నెల)ను విడుదల చేసింది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను మ.12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ. ఒంటి గంటకు విడుదల చేయనుంది. ప్రతినెలా శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను మూడు నెలల ముందుగానే టీటీడీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన షెడ్యూల్​ను టీటీడీ ఇటీవలే ప్రకటించింది. జులై నెలకు సంబంధించిన.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవల ఆన్​లైన్ లక్కీడిప్ కోసం.. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)