పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం కాంగ్రెస్‌కు, దీదీకి లేదు !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలోభాజపా అగ్ర నాయకుడు అమిత్‌ షా మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం కాంగ్రెస్‌కు కానీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ లేదని అన్నారు. ''బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే మీకు వచ్చిన సమస్య ఏంటని అడుగుతున్నాను. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే, సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే మోడీ మళ్లీ ప్రధానిగా రావాలి. గత ఎన్నికల్లో 18 సీట్లు ఇచ్చారు. ప్రతిగా మోడీ రామమందిరం తీసుకువచ్చారు. ఈసారి 35 సీట్లు ఇస్తే చొరబాట్లను ఆపేస్తారు. తన ఓటు బ్యాంక్‌పై దృష్టిపెట్టిన మమతాబెనర్జీ సందేశ్‌ఖాలీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదు. కానీ హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడు. భాజపాకు ఓటు వేయండి. అప్పుడు దీదీ గుండాలు తలకిందులుగా వేలాడతారు'' అని అమిత్‌ షా అన్నారు. ఈసారి తమ లక్ష్యం 35 లోక్‌సభ స్థానాలు సాధించడమని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. కానీ టీఎంసీ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ''10 సంవత్సరాల క్రితం టీఎంసీ నేతలు చిన్నపాటి ఇళ్లల్లో ఉండేవారు. సైకిల్‌ మీద తిరిగేవారు. కానీ ఇప్పుడు నాలుగు అంతస్తుల భవనాల్లో నివసిస్తూ కార్లలో చక్కర్లు కొడుతున్నారు. అందంతా ప్రజల సొమ్మే'' అంటూ విమర్శలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల్లో ప్రకటన వస్తుందనగా మార్చి నెలలో మోడీ సర్కార్‌ సీఏఏ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా దానిని జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఏఏ చట్టం-2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా చట్టం అమలులో జాప్యం చోటుచేసుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)