కవితకు మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు !

Telugu Lo Computer
0


విత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈడీ, సీబీఐ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియటంతో రెండు దర్యాప్తు సంస్థలు కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం, కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. నిన్నటి విచారణకు కొనసాగింపుగా రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని, సెక్షన్ 19 అనుగుణంగా కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు నివేదించారు. కవితను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపింది. 10 రోజుల పాటు సమన్లు ఇవ్వబోమని మాత్రమే ఈడీ 2023 సెప్టెంబర్‌ 26న అండర్‌టేకింగ్‌ ఇచ్చిందని పేర్కొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)