ఆదివాసీ, వనవాసీ పదాల మధ్య చాలా తేడా ఉంది !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో శనివారం కాంగ్రెస్‌ అభ్యర్థి ఖవాసి లక్మాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీ పదం అర్థాన్ని మార్చి వారి హక్కులపై దాడిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ అయినందున అయోధ్యలోని రాముని ప్రతిష్ట కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారని, బిజెపి మనస్తత్వానికి ఈ ఘటన అద్దం పడుతుందని అన్నారు. ప్రధాని మోడీ ఆదివాసీ పదం అర్థాన్ని మార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మనం గిరిజనులను ఆదివాసీలని పిలుస్తామని, కానీ మోడీ వనవాసి అని పిలుస్తున్నారని అన్నారు. ఆదివాసీ, వనవాసీ పదాల మధ్య చాలా తేడా ఉందని అన్నారు. ఆదివాసీ అంటే నీరు, అడవి, భూమిపై హక్కులు కలిగి ఉంటారని, వనవాసి అంటే కేవలం అడవుల్లో జీవించే వారని అర్థమని అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మతం, గిరిజనుల సిద్ధాంతాలు, చరిత్రపై దాడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గిరిజనుల భూములను బిజెపి బిలియనీర్లకు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. మోడీ పాలనలో 22 మంది వ్యాపారవేత్తలు 70 కోట్ల మంది భారతీయులకు సమానమై సంపాదనను కూటబెట్టారని దుయ్యబట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)