భువనగిరి గురుకుల పాఠశాలలో ఎనిమిది మందికి అస్వస్థత !

Telugu Lo Computer
0


తెలంగాణలోని భువనగిరి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఎనిమిది మంది విద్యార్థులు శనివారం అస్వస్థత గురయ్యారు. హుటాహుటిన తెల్లవారుజామున వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి తిన్న ఆహారమే కారణమని పేర్కొంటున్నారు. గురుకుల పాఠశాలకు చెందిన టీ కార్తిక్, ఎం శ్రీవత్సవ, ఏ అజయ్, బి భవిష్, అజయ్, పి రిషిత్, ఎం జస్వంత్, పి జస్వంతులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఒక విద్యార్థి వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. 6 గంటల 30 నిమిషాలకు మరో విద్యార్థి కడుపునొప్పి అంటూ బాధ పడ్డాడు. దీంతో ఇద్దరిని చేర్పించిన తర్వాత ఉదయం 11 గంటలకు మరో ఆరుగురు విరోచనాలు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించారు. కలుషిత ఆహారం తీసుకోవడంతోటే కడుపునొప్పి విరోచనాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. మిగతా విద్యార్థులను డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు విద్యార్థుల యొక్క పరిస్థితిని తెలుసుకొని ఆరా తీశారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కలుషిత ఆహారానికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)