తెలంగాణలో డీఎస్సీ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు

Telugu Lo Computer
0


తెలంగాణలో డీఎస్సీ పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్లకు నేటితో గడువు ముగిసింది. అయితే దీనిని జూన్ 20 వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి జూన్ 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే డీఎస్సీ పరీక్ష తేదీలను ఖరారు చేశారు. జులై 17 నుంచి 31 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)