మార్చిలో 51 శాతం పెరిగిన సన్‌ ఫ్లవర్‌ ఆయిల్ దిగుమతులు !

Telugu Lo Computer
0


పామాయిల్‌ దిగుమతులు పడిపోవడంతో.. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, సోయా వంట నూనెల దిగుమతులు పెరిగాయి. సన్‌ఫ్లవర్‌ వంట నూనె దిగుమతులు ఫిబ్రవరితో పోల్చితే గడిచిన మార్చిలో 51 శాతం పెరిగాయని రాయిటర్స్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇంత గరిష్ట స్థాయిలో పెరగడం రెండవ సారి. ప్రత్యర్థి పామాయిల్‌ కొనుగోలును తగ్గించడంతో పాటు తక్కువ ధరలో ఇతర వంట నూనెల కొనుగోళ్లను పెంచడానికి దారి తీసిందని.. మలేషియాను ఉద్దేశించి ఐదుగురు డీలర్లు పేర్కొన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల నూనెల దిగుమతిదారుగా ఉన్న భారత్‌ పామాయిల్‌ కొనుగోళ్లను తగ్గించడంతో అత్యధికంగా ట్రేడ్‌ అవుతున్న మలేషియా పామాయిల్‌ ఫ్యూచర్స్‌లో ర్యాలీని పరిమితం చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. డీలర్ల అంచనాల ప్రకారం.. గడిచిన మార్చిలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతులు నెలవారీగా 51 శాతం పెరిగి 4,48,000 మెట్రిక్‌ టన్నులకు చేరుకున్నాయి. పామాయిల్‌ దిగుమతులు 3.3 శాతం తగ్గి 4,81,000 టన్నులకు పరిమితమయ్యాయి. ఇది మే 2023 నాటి అతి కనిష్ట స్థాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)